అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్ నందు శనివారం నూతన ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించిన ట్రైనీ ఎస్సై మహేష్ ప్రజలకు బ్యాంక్ ఖాతాదారులకు ఎస్ బీ ఐ సంస్థ మెరుగైన సేవలను అందించాలని పేర్కొన్నారు. నూతన ఏటీఎం కేంద్రాన్ని బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఏఎస్ఐ రామదాసులతో కలిసి ట్రైని ఎస్సై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. తమ ఎస్బిఐ బ్రాంచ్ నందు ఖాతాదారులకు అన్ని రకాల లావాదేవీల సేవలను అందిస్తున్నామని మేనేజర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సురేష్, ఎర్రి స్వామి, రాము తదితరులు పాల్గొన్నారు.