అనంతపురం అర్బన్: ఆస్తి కోసం డబ్బుల కోసం సొంత కుటుంబ సభ్యులే విచక్షణ రహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆస్తి కోసం డబ్బుల కోసం సొంత కుటుంబ సభ్యులే దాడికి పాల్పడినట్లుగా ఆంజనేయులు అనే బాధితుడు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.