ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వ్యక్తి అనుమానదాస్పద మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని దిగువ అహోబిలం బీసీ హాస్టల్ సమీపంలోని ఓ ఇంట్లో శంకర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు, అతని తలపై గాయాలు ఉన్నాయి, శనివారం ఇంటి నుంచి దుర్వాసన రావటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు, ఘటన స్థలాన్ని రూరల్ ఎస్సై బివి రమణ ఎస్ఐలు పరిశీలించారు, వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు