డోన్: డోన్ లో గోల్డ్ షాపులు బంద్
Dhone, Nandyal | May 19, 2026 ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా స్వర్ణకారులు డోన్లో గోల్డ్ షాపులు మూసివేసి మంగళవారం బంద్ పాటించారు. ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దన్న మోదీ వ్యాఖ్యలు తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు ఆచారి తెలిపారు. ప్రత్యేక నిధులు కేటాయించి, జీవన భృతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులు నిరసనలు చేపట్టినట్లు నాయకులు వెల్లడించారు.