సంగారెడ్డి: శ్రీ క్షేత్రంలో కార్తీక దీపోత్సవం, దీపాలు వెలిగించిన రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి
సంగారెడ్డిలోని శ్రీ క్షేత్రంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవ నంద సరస్వతి స్వామి హాజరై దీపాలను వెలిగించారు. కార్తీక మాసం విశిష్టతను భక్తులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావనతో కలిగి ఉండాలని భక్తితోనే ముక్తి లభిస్తుందని అన్నారు.అనంతరం ఆలయ ఆవరణలో భక్తులు మహిళలు దీపాలను వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.