బి యాలేరు గ్రామంలో ఉరేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 12, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం బి యాలేరు గ్రామానికి చెందిన రజిని అనే వివాహిత సోమవారం మధ్యాహ్నం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతి చెందిందని పోలీసులు వివరాలను మధ్యాహ్నం వెల్లడించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.