కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ప్రైవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు , జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సంధర్బంగా కర్నూలు, బళ్ళారి చౌరస్తా దగ్గర శుక్రవారం తెల్లవారుజామున కోడుమూరు సిఐ తబ్రేజ్ గారు రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు భారీ వాహానాలకు “స్టాప్ - వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహించారు.