ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో డీజిల్ పెట్రోల్ కోసం క్యూ కట్టిన వాహనదారులు, సోషల్ మీడియాలో కొరత ఉందని పుకార్లు, స్పందించిన కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 26, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో డీజిల్ పెట్రోల్ కొరత ఉందంటూ పుకార్లు వ్యాప్తి చెందడంతో ఆదివారం స్థానికంగా ఉన్న వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం క్యూ కట్టారు. అధికారులు వీటిపై పర్యవేక్షించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని పెట్రోల్ బంకుల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. డీజిల్ కొరత కొంతవరకు ఉన్న రేపటికల్లా అది భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు చెప్పారు.