కాట్రేనికోన మండలంలో ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుంది. 11 కేవీ లైన్ మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. కాట్రేనికోన టౌన్, వేట్లపాలెం, జీకే పొర, చిర్రాయానాం, గెద్దనపల్లి, నడవపల్లి, కుండలేశ్వరం, దొంతుకుర్రు, కొప్పిగుంట, పండి, పల్లం, పల్లంకుర్రు, బలుసుతిప్ప, మొల్లెటిమోగ గ్రామాలకు విద్యుత్ నిలుపుదల చేయనున్నట్లు అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి కుమార్ పేర్కొన్నారు.