నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా,పట్టించుకోని అధికారులు
Nandyal Urban, Nandyal | May 17, 2026
నంద్యాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రాత్రికి రాత్రి టిప్పర్లలో మట్టిని తరలిస్తున్న కాపాడాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడు నెలల నుంచి గోస్పాడు మండలంలో కుందు నది ఒడ్డున ఉన్న మట్టిని కొందరు అక్రమంగా అర్ధరాత్రి టిప్పర్లలో తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక టిప్పర్ మట్టి 3000 నుంచి 6000 రూపాయల వరకు మట్టి మాఫియా విక్రయిస్తున్నట్లు సమాచారం. కుందూ నది ఒడ్డున ఉన్న మట్టి నే కాకుండా ప్రభుత్వ భూముల్లో కూడా మట్టిని తవ్వేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి