అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా నాయన పల్లి క్రాస్ సమీపంలో బ్రిడ్జ్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి వృద్ధుడికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని నార్పల మండలం నాయనపల్లి క్రాస్ సమీపంలో బ్రిడ్జ్ పైనుంచి ప్రమాదవశాత్తుగా కిందపడడంతో నాయనపల్లి క్రాస్ కు చెందిన జయరాములు అనే వృద్ధుడికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని నేషనల్ హైవే అంబులెన్స్ సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.