అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామంలో మంగళవారం విద్యుత్ శాఖ సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో కొత్తగా కరెంటోళ్ల జనబాట అనే ప్రోగ్రామ్ ప్రారంభించినట్టు మండల విద్యుత్ శాఖ ఏఈ గంగాధర్ పేర్కొన్నారు. ప్రతి మంగళవారము, శుక్రవారం సెలెక్ట్ చేసిన గ్రామానికి విద్యుత్ శాఖ అధికారులు అందరూవెళ్లి 11 Kv , LT line, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల మార్పు తదితర సమస్యలను పరిష్క రించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే ప్రోగ్రాం కరెంటోళ్ల జన బాట అని విద్యుత్ శాఖ ఏ ఈ పేర్కొన్నారు.