ఆళ్లగడ్డ: హైవే ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు : జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు శుక్రవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా సంబంధిత శాఖ అధికార సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆమె అధికారులను ఆదేశించారు, ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ చర్యల సమీక్షలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా పాల్గొన్నారు, ప్రమాదాలకు కారణం అవుతున్న ప్రాంతాల్లో తక్షణమే రేడియం సైన్స్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు