ధర్మవరం పట్టణం శారద నగర్ లో ఇటీవలే పీఎం అవాస్ యోజన కింద మంజూరయ్యాయి. బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పట్టణంలో పర్యటించి పీఎం ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ధర్మవరం పట్టణంలో 945 ఇల్లు మంజూరు అయ్యాయని త్వరలో నిర్మాణాలు చేపడతామని మంత్రి తెలిపారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు.