డోన్: డోన్ లో రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, వాహనదారులకు ఇబ్బందులు
Dhone, Nandyal | Jun 24, 2026 నంద్యాల జిల్లా డోన్ పాతపేటలోని అంబాభవాని ఐస్ పార్లర్ సమీపంలో మున్సిపాలిటీ అధికారులు చేపట్టిన కల్వర్టు నిర్మాణం పూర్తయి 25 రోజులు దాటింది. పనుల తర్వాత మిగిలిన మట్టిని తొలగించకపోవడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనివల్ల స్థానిక ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, పేరుకుపోయిన మట్టిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు