ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా జనసేన లో గ్రూపులు లేవు : జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్
Ongole Urban, Prakasam | May 21, 2026
ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని ఎన్నికలకు ముందైనా తర్వాత అయినా జనసేన అంతా కలిసే ఉన్నారని జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గురువారం ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు జనసేన పార్టీలో పదవులు పని చేసే వాళ్లకు మాత్రమే ఇస్తారని డబ్బులకు పదవులు అమ్మడం జనసేన పార్టీలో ఉండదని తెలిపారు జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయం అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తున్నామన్నారు రోడ్డెక్కి మాట్లాడే వారికి పార్టీకి సంబంధం లేదని పార్టీ ప్రకాశం జిల్లాలో బలంగా ఉందని తెలిపారు పార్టీ బలంగా ఉంది కాబట్టే అందరు పార్టీలో చేరుతున్నారని అది గమనించాలన్నారు