సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హయత్నగర్ బీజేపీ యువమోర్చా అధ్యక్షులు అఖిల్ ఆధ్వర్యంలో సాయిబాబా గుడి వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని పాలించాల్సిన వ్యక్తి ప్రజల మనోభావాలను దెబ్బతీయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఇకనైనా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.