మాడుగులపల్లి: అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: ఏపిఎం భాషపాక చంద్రశేఖర్
నల్గొండ జిల్లా, మాడుగుల పల్లి మండల పరిధిలోని ఆగం మోత్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం భాషపాక చంద్రశేఖర్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లు వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని పండించిన ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.