ఒంగోలు అర్బన్: 47 మంది లబ్ధిదారులకు 34 లక్షల 15 వేల సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | May 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు బుధవారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలులో నూతన టెక్నాలజీ తో కూడిన అమర్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా 47 మంది లబ్ధిదారులకు 34 లక్షల 15 వేల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు అనంతరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు ఓణీల ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం పలు శుభకార్యాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు టిడిపి కార్యకర్తలు ముఖ్య నేతలు పాల్గొన్నారు