అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల డిప్యూటీ ఎంపీడీవో గా ఏకాంబరేశ్వరయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా ఉంటూ పదోన్నతిపై బెలుగుప్ప డిప్యూటీ ఎంపీడీవో గా రావడం జరిగింది నూతన డిప్యూటీ ఎంపీడీవోకు ఎంపీపీ పెద్దన్న ఎంపీడీవో లక్ష్మీనారాయణ యు ఆర్ డి గోపాల్ టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున తదితరులు గౌరవ సన్మానం చేసి స్వాగతించారు. మండల ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని డిప్యూటీ ఎంపీడీవో ఈ సందర్భంగా పేర్కొన్నారు.