ఇబ్రహీంపట్నం: దిల్సుఖ్నగర్లో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ మహాసభ
దిల్సుఖ్నగర్లో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ మహాసభ నిర్వహించారు. అధ్యక్షురాలిగా మలోబిక, కార్యదర్శిగా పృథ్వి తేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. ఫ్రీ బస్సు కారణంగా విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.