బనగానపల్లె: యాగంటి ఉమామహేశ్వర స్వామికి హుండీల ద్వారా రూ. 33.29 లక్షల ఆదాయం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని ప్రముఖ సేవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఈవో పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.109 రోజులకు గాను స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించారు హుండీల ద్వారా 33, 29,573 రూపాయలు, వెండి 70 గ్రాములు బంగారం ఒక గ్రామం కానుకల రూపంలో వచ్చినట్లు ఈవో తెలిపారు