ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరంలో ప్రశాంతంగా నీట్ పరీక్షలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
Ongole Urban, Prakasam | May 3, 2026
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఆదివారం ' నీట్ ' పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయం, డి.ఆర్.ఆర్.ఎం. మున్సిపల్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నీట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 1728 మంది అభ్యర్థులకుగాను 1681 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయం కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. భద్రతా ఏర్పాట్లు, పరీక్ష కేంద్రాలలో కల్పించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు ఉన్నార