కర్నూలు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు మరువలేనివి:మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు భారత జాతి ఎన్నటికీ మరువలేదని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ఎం సుధాకర్ బాబు గారు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 137 వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆజాద్ గారి చిత్ర పటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్యకర్తల సమావేశంలో సుధాకర్ బాబు గారు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారని 1940 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేశారని, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యాడని, ఖిలాఫత్, సహాయ నిర