బనగానపల్లె: బనగానపల్లెకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
'మీ భూమి.. మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు గురువారంబనగానపల్లెకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 8,412 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. మొదట ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, రైతులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అప్పలాపురం, కాపులపల్లి రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తారు.