యాడికి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నృత్య పోటీలు నిర్వహించారు. బాలికలు, యువతులు అద్భుతంగా నృత్యం చేశారు.నృత్య పోటీల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. అనంతపురం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు చెందిన భక్తులు భారీగా తరలి వచ్చారు.