బనగానపల్లె: కొత్తూరు ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మంత్రి హామీ
నంద్యాల జిల్లా పాణ్యం కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం డ్రైనేజీ సమస్యపై సత్రం కమిటీ సభ్యులు స్పందించారు. నంద్యాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సత్రం కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.