పెద్దఅడిశర్లపల్లి: నాగార్జున సాగర్‌లో ఇంకా లభ్యం కానీ గల్లంతైన యువకుడి ఆచూకీ, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ లో సోమవారం సాయంత్రం గల్లంతైన రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, జాపాల్ గ్రామానికి చెందిన శివ అనే యువకుడు సెల్ఫీ దిగుతూ గల్లంతు కాగా పోలీసులు మంగళవారం నుండి గాలింపు చర్యలను చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం సీఐ శ్రీను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిడ్జి పై నుండి జారిపడి గల్లంతైన శివ అనే యువకుని ఆచూకీ కోసం ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశామని తెలిపారు. ఇంకా యువకుని ఆచూకీ లభ్యం కాలేదని గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ శ్రీను నాయక్ తెలిపారు.