రాజేంద్రనగర్: భూములు కోల్పోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటాం: మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే కిచెన్ గారి లక్ష్మారెడ్డి
భూములు కోల్పోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. భూములు, స్థలాలు కోల్పోయిన వారికి ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు, ఇండ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తుక్కుగూడ, కందుకూరు, మీఝాన్పేట, బేగరికంచ గ్రామస్థులతో ఆయన మంగళవారం భేటీ అయ్యారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి గ్లోబల్ సమ్మిట్లో స్థానిక రైతులు భాగస్వామ్యం అయ్యేలా చూస్తామన్నారు.