కోడుమూరు: బాధితునికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందించిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని నందనపల్లి గ్రామానికి చెందిన మధు కుమార్ అనే వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంగళవారం అందజేశారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాధితుడు ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు బాధితునికి రూ .60,877 మంజూరయ్యాయి.