రామసముద్రం MPP కుసుమ కుమారి చికిత్స పొందుతూ మృతి.
అన్నమయ్య జిల్లా. మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం ఎంపీపీ కుసుమ కుమారి 70 సంవత్సరాలు బెంగుళూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం రామసముద్రంలో మదనపల్లె వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, ఎంపీపీ కుసుమ కుమారి భౌతికయని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.