ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పోలీసులు విస్తృత తనిఖీలు, దొంగలపై నిఘా పెంచిన అధికారులు
Ongole Urban, Prakasam | Jun 15, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దొంగతనాలు అరికట్టే విషయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఏటీఎం కేంద్రాలు, లాడ్జిలపై నిఘా పెట్టారు. అలానే అర్ధరాత్రి వేళల్లో సంచరిస్తున్న వారి వివరాలను సేకరించడంతోపాటు అనుమానిత వ్యక్తులను ఫింగర్ ప్రింట్ ద్వారా గుర్తిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ఎవరన్నా గుర్తిస్తే 112 లేదా 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.