ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు విద్యార్థులు శ్రద్ధాంజలి
ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోమవారం అపుస్మా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు విద్యార్థులు శ్రద్ధాంజలి ఘటించారు. సంఘం అధ్యక్షుడు అమీర్ భాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రతన్ టాటా సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం భాషా, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.