కమలాపురం: వీరపునాయనిపల్లె : చెరువుకు నీరోస్తే రైతుల కష్టాలు తీరుతాయి - చీని రైతుల ఆవేదన
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని వీరపునాయన పల్లె మండలం తలపనూరు గ్రామానికి చెందిన రామ్ లక్ష్మణారెడ్డి, రాజా నర్సింహారెడ్డి మరికొందరు రైతులు దాదాపు 200 ఎకరాలలో చిని చెట్లు సాగు చేశారు.ఈ సందర్బంగా సోమవారం చీని రైతులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వర్షాలు రాక బోర్లలో నీరు ఎండి పోవడంతో చీని చెట్లకు నీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. చీనాచెట్లు వాడిపోతు కాయలు రాలుతున్నాయని వాటికి ట్యాంకర్లతో నీరు తోలడం కష్టంగా మారిందని, ఒక్కో ట్యాంకర్ 1000 రూపాయలు ఖర్చు చేసినా పంట చేతికొస్తాధో రాదోని,చెరువుకు నీరొస్తె దాదాపు 200ఎకరాలకు సాగు, తాగునీటి కష్టాలు తీరతాయన్నారు.