డోన్: రౌడీషీటర్లు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : బేతంచర్ల సిఐ వెంకటేశ్వరరావు.
Dhone, Nandyal | May 24, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల మండలంలో అల్లర్లు, ఘర్షణలకు పాల్పడే రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కౌన్సిలింగ్లో ఆయన మాట్లాడారు. సమాజంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా, ప్రశాంతమైన ప్రజాజీవనం గడపాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.