వెంకటాపురం గ్రామం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు, మృతుడు మధు చికెన్ కోసం సిరివెళ్ళకు వెళ్లి తిరిగి గ్రామానికి బైక్ పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది, ఈ ప్రమాదంలో మధు అక్కడికక్కడే మృతి చెందాడు, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.