బుచ్చిబాపన పాలెంలో డిపెప్ స్కూల్ కూల్చివేతలపై పల్నాడు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
పల్నాడు జిల్లా,బుచ్చిబాపన పాలెం గ్రామంలో డిపెప్ స్కూల్ కూల్చివేతలపై సోమవారం పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్వాహక అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందచేశారు.ఈసందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ గత శనివారం తాము రొంపిచర్ల మండలం బుచ్చి బాపన పాలెం గ్రామం డిపెప్ స్కూల్ కు వెళ్ళామన్నారు. స్కూల్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చొరబడి ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా,అధికారుల పర్యవేక్షణ లేకుండా,వంటగది,వాటర్ ట్యాంకు బాత్రూం మరియు చెట్లు కూల్చివేశారని మండిపడ్డారు.