మద్దిరాల: భూ భారతి తో సమస్యలు పరిష్కారం: మద్దిరాలలో భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్
భూభారతి చట్టం- 2025 అమలుతో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం మద్దిరాలలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. భూభారతి చట్టంలో తహశీల్దార్ నుంచి సీసీఎన్ఏ స్థాయి వరకు సమస్యలు పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పించారని, భూభారతితో భూ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు.