హుస్నాబాద్: హుస్నాబాద్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు: శమీ, ఆయుధ పూజలో పాల్గొన్న మంత్రి పొన్నం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి సందర్భంగా శమీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రతా సిబ్బంది ఆయుధ పూజ కూడా చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.