డోన్: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: బేతంచెర్ల ఎస్సై రమేష్ బాబు
Dhone, Nandyal | Apr 11, 2026 మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రమేశ్ బాబు హెచ్చరించారు. శుక్రవారం బేతంచెర్లలో వాహనాలు తనిఖీ, డ్రంక్ డ్రైవ్ కార్య క్రమం చేపట్టారు. వాహనానికి సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు బ్రీతింగ్ పరిశీలించారు. డ్రంక్ డ్రైవ్లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.