విశాఖపట్నం: ఋషికొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, యూటర్న్ తీసుకుంటుండగా కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం
విశాఖలోని ఋషికొండ సమీపంలో గురువారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. యూ టర్న్ తీసుకుంటున్న ఒక కారును వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియరాలేదు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.