రాప్తాడు: RDT క్రీడా మైదానంలో 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ ఉప్పరపల్లి వద్ద ఆర్డిటి క్రీడ మైదానంలో ఆదివారం 11:30 గంటల సమయంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏడవ రాష్ట్రస్థాయి రెవిన్యూ క్రీడల్లో భాగంగా విజయనగరం చిత్తూరు జట్ల మధ్య కబడ్డీ పోటీలను క్రికెట్ పోటీలను మంత్రి సత్య ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ అనంతపురంలో ఏడవ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు పాల్గొన్న మానందంగా ఉందని రెవెన్యూ ఉద్యోగులు నిత్యం పని ఒత్తిడితో ఉంటారని వారికి ఇలాంటి పోటీలు నిర్వహించడం శుభ పరిణామాన్ని రెవెన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్ పేర్కొన్నారు.