పలమనేరు: ఒంటరి ఏనుగు రాకపోవడంతో తిరిగి ఎలిఫెంట్ హబ్ కు తరలిన కుంకీలు జయంత్, గణేష్, పలు జాగ్రత్తలు తీసుకున్నామన్న ఎఫ్ఆర్ఓ
పలమనేరు: అటవీ శాఖ అధికారి నారాయణ తెలిపిన సమాచారం మేరకు. శనివారం రోజున ఒంటరి ఏనుగు పట్టణంలోకి ప్రవేశించి ఎఫ్ ఎస్ ఓ పై దాడి చేసి బీభత్సం సృష్టించిన సంగతి అందరికీ విధితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెండు కుంకి ఏనుగులు జయంత్ గణేష్ లను ఎలిఫెంట్ హబ్ నుండి అటవీ ప్రాంతానికి తరలించి, ఒంటరి ఏనుగు మళ్లీ పట్టణంలోకి ప్రవేశించకుండా క్యాప్చరింగ్ చేయించడానికి తీసుకొచ్చాము. కొన్ని గంటల పాటు పర్యవేక్షించి ఒంటరి ఏనుగు తిరిగి రాకపోవడంతో కుంకి ఏనుగులను ఎలిఫెంట్ హబ్ కు తరలించడం జరిగిందన్నారు. కుంకి ఏనుగులతో పాటు 30 మందితో పలు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.