డోన్: బేతంచర్ల లో ఉత్సాహంగా రాష్ట్రస్థాయి వృషబాల బండలాగుడు పోటీలు
Dhone, Nandyal | Apr 8, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు వీటిని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి 11 జతల వృషభాలు పోటీలో పాల్గొన్నాయి. రైతులు, యువకుల ఈలలు, కేరింతల మధ్య ఈ పోటీలు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి. విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.