విశాఖపట్నం: విశాఖ: జీఎస్టీపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాడిసన్ బ్లూ హోటల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ ఔట్రీచ్ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జీఎస్టీ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన సానుకూల మార్పులను, దాని విజయాలను వివరించారు. వ్యాపార కార్యకలాపాలు సులభతరం కావడంలో జీఎస్టీ ఎలా తోడ్పడిందో తెలిపారు. జీఎస్టీలో ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన మార్పులు, విధానాలను గురించి ప్రస్తావించారు.