గుర్రంపోడు: మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు
నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలలో గురువారం సాయంత్రం మండల వ్యవసాయ శాఖ అధికారి కంచర్ల మాధవరెడ్డి, స్థానిక పోలీసులు సంయుక్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం సబ్సిడీ కింద రైతులకు అందించే యూరియాను రూ.266 కు బదులుగా రూ.300 లకు విక్రయిస్తున్న మూడు షాపుల యజమానులు ఎర్ర శ్రీనివాసరావు, బొమ్ము ఆనంద్, చందా గోవింద్ రెడ్డి లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.