రాప్తాడు: ఆర్డిటి వద్ద శివకోటి ఆలయంలో మహారుద్రహ - సహస్ర శంఖాభిషేకం, 14 నుంచి 17 వరకు శివకోటి ఆలయ నిర్వాహకుడు అమర్నాథ్ వెల్లడి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆర్డిటి కార్యాలయం వద్ద ఉన్న శివకోటి ఆలయంలో 11 పది నిమిషాల సమయంలో ఆలయ నిర్వాహకుడు అమర్నాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ శివకోటి ఆలయంలో మహారుద్ర సహస్ర శంఖాభిషేకం నవంబర్ 14 నుంచి 17 వరకు మహా శివునికి అన్నాభిషేకం, సహస్ర లింగార్చన, లక్షబిల్వర్చన ,దశలక్ష శ్రీ లలితా సహస్ర పారాయణం అప్పుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయంతం చేయాలని శివకోటి ఆలయ నిర్వాహకుడు అమర్నాథ్ పేర్కొన్నారు ఈ సమావేశంలో అప్పు స్వామి పూజారి హరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.