అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావలిగి గ్రామానికి చెందిన యువ రైతు భూమా ప్రతాప్ (24) బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్సలు పొందుతూ మంగళవారం మృతి చెందాడు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు శనివారం మిరప చేనులో పురుగుల మందు కొట్టడానికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు కర్ణాటకలోని బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడని పేర్కొన్నారు.