నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికుల వినతి #localissue
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పలు కాలనీలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి.. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ఏం ప్రమాదం చోటు చేసుకుంటాయ నీ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.