వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు: ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వరస్వామివారిని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన కుమారునితో కలిసి తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా ఆలయానికి చేరుకోగానే అర్చకులు వేద పండితులు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.రాజన్నస్వామివారితో పాటు పరివార దేవతలకు కూడా ప్రత్యేక పూజలు చేసినట్టు వెల్లడించారు. అనంతరం అద్దల మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి ప్రసాదాన్ని అందజేశారు.పుట్టినరోజు సందర్భంగా ఆలయ అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి సన్మానించి సత్కరించారు.